AP&TG

పొట్టి శ్రీరాముల త్యాగాలను గుర్తు చేసుకుంటు,రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి-సీ.ఎం చంద్రబాబు

అమరావతి: అమరావతిలోని శాఖమూరులో 6.80 ఎకారల్లో పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలసి సోమవారం ఆవిష్కరించారు.ఈ సందర్బంలో సీ.ఎం చంద్రబాబు మాట్లాడుతూ యుద్ద ప్రభావంతో రాష్ట్రంలో వివిధ ఉత్పత్తుల మార్కెటింగ్ కు ఇబ్బందులు వస్తున్నప్పటికి ఆ ప్రభావం దేశం మీద పడకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రధాని మోదీ పని చేస్తున్నారని, దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్-1 చేసేలా మనం పని చేయాలని పిలుపు నిచ్చారు. కష్టకాలంలో సమిష్టిగా పని చేయాలి… అభివృద్ధి ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పొట్టి శ్రీరాములు వంటి వారి త్యాగాలను నిరంతరం గుర్తు చేసుకుంటు, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు.అమరజీవి త్యాగ ఫలితంగా రాష్ట్రం వచ్చిందని, ఆయన స్పూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు. ఈ విగ్రహానికి ‘అమరజీవి-త్యాగ శిల్పం (స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్) గా నామాకరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్:- తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. మద్రాస్‌ ప్రెసిడెన్సిలో తెలుగు ప్రజల ఇబ్బందులను ఆయన గుర్తించి.. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ముఖ్యంగా తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు.ఈ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్‌ వినియోగించారని చెప్పారు.పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘాలు, ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో బీజెపీ అధ్యక్షడు మాధవ్,మంత్రులు,సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *