కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్న హైస్పీడ్ బోటు
నెల్లూరు: మత్స్యకారుల సంక్షేమం, భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక చొరవతో కాకినాడ హార్బర్ నుంచి నెల్లూరు జిల్లాకు హైస్పీడ్ బోటును మత్స్యశాఖ అధికారులు తీసుకొ వచ్చారు. 326 హెచ్పి హైస్పీడ్ బోటుతో గంటకు 18 కి.మీ వేగంతో నిరంతరం గస్తీ కాస్తూ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల మత్స్యకారుల అక్రమ వేటకు అడ్డుకట్ట వేస్తుంది. అలాగే వీడియో రికార్డింగ్ సౌకర్యం గల బైనాక్యూలర్లు, హెవీ ఫోక్స్ లైట్లతో తమిళనాడు, పాండిచ్చేరి మత్స్యకారుల కదలికలపై నిరంతరం నిఘా పెడుతుంది. ప్రస్తుతం సముద్రతీరంలో మూడు బోట్లతో పహారా కాస్తున్న టాస్క్ ఫోర్సు బృందాలు, రాత్రి వేళల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మరో నూతన హైస్పీడ్ బోటు కొనుగోలుకు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

