AP&TG

పరిశుభ్రత సిబ్బందికి సామర్థ్య అభివృద్ధి-నైపుణ్య శిక్షణ

నెల్లూరు: పట్టణాలలో పరిశుభ్రత సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పరిశుభ్రత సిబ్బందికి సామర్థ్య అభివృద్ధి-నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో బుధవారం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పరిశుభ్రత సిబ్బందికి ఘన వ్యర్థాల నిర్వహణ, వ్యక్తిగత భద్రతా పరికరాల (PPE) వినియోగం, పరిశుభ్రత పనుల్లో పాటించాల్సిన ఆరోగ్య-భద్రతా ప్రమాణాలు, వ్యర్థాల వర్గీకరణ, నగర పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే సురక్షితంగా పనులు నిర్వహించే విధానాలు, పరిశుభ్రత నిర్వహణలో ఆధునిక పద్ధతులను కూడా వివరించారు. ఈ కార్యక్రమాన్ని రిసోర్స్ పర్సన్ డి.రేవతి వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ డి. సుజాత అశోక్,, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఓ. దినేష్ కుమార్ లు హాజరై పరిశుభ్రత సిబ్బంది సమాజ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రత సిబ్బంది కృషిని ప్రశంసిస్తూ, ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు వారి నైపుణ్యాలను పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరమని తెలిపారు. పరిశుభ్రత నిర్వహణలో సిబ్బంది పాత్రను ప్రస్తావిస్తూ, భద్రతా చర్యలను పాటిస్తూ సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు.
Capacity Development-Skill Training for Sanitation Staff

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *