వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
అమరావతి: అధికారంలో వున్నప్పుడు ఉచ్చనీచాలు మరిచిపోయి,,చంద్రబాబు,,పవన్ కళ్యాణ్ లపై రాజకీయ విమర్శలు బదులుగా వ్యక్తిత్వ హననంకు పాల్పపడిన.ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.నానిపై 196(1), 353(2), 351(2), 352 BNS సెక్షన్ల కింద కేసు పెట్టారు. రెండు రోజుల క్రిందట ఏలూరు జిల్లా చాట్రాయిలో జరిగిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పేర్ని నాని రెచ్చిపోయి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ శ్రేణులు,, మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పీఎస్‌లో నానిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పేర్ని నానిపై కేసు నమోదు చేశారు.

