మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక క్రీడోత్సవాలు-2026-కమీషనర్
నెల్లూరు: మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక క్రీడోత్సవాలు-2026 లో భాగంగా “సింహపురి గ్రామ వార్డు సచివాలయాల జాయింట్ యాక్షన్ కమిటీ” ఆధ్వర్యంలో స్థానిక ఏ.సి సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ఈనెల 28, 29 తేదీలలో సచివాలయ వార్డు కార్యదర్శులకు వివిధ విభాగాలలో క్రీడలను నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వై.ఓ నందన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మహిళల విభాగంలో త్రో బాల్, బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్, కబడ్డి, 100 మీటర్స్ రన్నింగ్ రేస్, లాంగ్ జంప్, షాట్ పుట్, చెస్ క్రీడలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
పురుషుల విభాగంలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డి,100 మీటర్స్ రన్నింగ్ రేస్, 400 మీటర్స్ రన్నింగ్ రేస్, లాంగ్ జంప్, షాట్ పుట్ క్రీడలను నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు జె.ఏ.సి నిర్వాహకులు దారా సురేష్ బాబు 63058 78722, భాను ప్రకాష్ 89775 79060 లను సంప్రదించి బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే క్రీడలలో పాల్గొనాలని కమిషనర్ సూచించారు.

