ఇండియా-ఈయూల మధ్య కుదిరిన స్వేఛ్చ వాణిజ్య ఒప్పందం
అమరావతి: భారత్-యురోపియన్ యూనియన్ ల మధ్య భారీ వాణిజ్య ఒప్పందం ఖరారు అయింది. ఇది చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అని, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ప్రధాన మంత్రి నరేద్ర మోదీ అభివర్ణించారు. న్యూఢిల్లీలో మంగళవారం భారత్ పర్యటనలో ఉన్న యురోపియన్ నేతల సమక్షంలో జరిగిన 16వ భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో ఈ ప్రకటన చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కలిసి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను యూరోపియన్ యూనియన్ వాణిజ్య కమిషనర్ మారోష్ షెఫ్కోవిచ్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పరస్పరం మార్పిడి చేసుకున్నారు.
ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటా:- ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇండియా-ఈయూ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభాన్ని నివారించడంలో సాయపడుతుందన్నారు.ఈ ఒప్పందం ఇండియా, యూరప్ ప్రజలకు అద్భుత అవకాశాలను కల్పిస్తుందని, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనపై మన నిబద్దతను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ప్రపంచ జీడీపీలో ఇండియా-ఈయూ వ్యాపార భాగస్వామ్య వాటా 25 శాతం ఉందని వెల్లడించారు.ఇండియా-ఈయూ మధ్య 1962 నుంచి నుంచి వ్యాపార, వాణిజ్య ఒప్పందం కొనసాగుతొందని,,2004 నుంచి వ్యూహాత్మకంగా మారిందన్నారు. ఈ రెండు దశాబ్దాలలో ఎదురైన అనేక అవరోధాలకు నేడు కుదిరిన ఒప్పందం తొలగిస్తొందన్నారు. ఇండియా-ఈయూల మధ్య తాజాగా కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయంగా కీలకంగా మారనున్నదని పేర్కొన్నారు.
136 బిలియన్ నుంచి:- భారత్‌కు యూరోపియన్.2024-25లో వస్తువుల ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు (136 బిలియన్) రూ.11.5 లక్షల కోట్లకు చేరింది. ఎగుమతులు రూ.6.4 లక్షల కోట్లు, దిగుమతులు రూ.5.1 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.2024లో సేవల వాణిజ్యం రూ.7.2 లక్షల కోట్లకు చేరింది.
భారత తయారీ, క్లీన్ ఎనర్జీ:- ఇండియా-ఈయూ ఒప్పందం ఫలితం కారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి సానుకూల సంకేతాల్ని అందిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత తయారీ, క్లీన్ ఎనర్జీ, డిజిటల్ వంటి రంగాల్లో ఈయూ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు భారత ఐటీ కంపెనీలు, ఫార్మా వంటి సంస్థలు యూరప్‌లో సేవలందిస్తున్నాయి.
పీయూష్ గోయల్:- ఈ సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ “భారత్-యురోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్ ఆర్థిక భాగస్వామ్యంలో కీలక విజయంగా నిలుస్తుందని తెలిపారు”. విశ్వసనీయమైన, పరస్పర లాభదాయకమైన, సమతుల్య భాగస్వామ్యాల వైపు భారత్ అడుగులు వేస్తున్న దిశకు ఇది మరింత బలాన్ని ఇస్తుందన్నారు.

