DISTRICTS

గణతంత్ర విలువలను కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి- జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

77వ గణతంత్ర దినోత్సవ సందేశం..

నెల్లూరు: 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికి కలెక్టర్ హిమాన్షు శుక్ల హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.సోమవారం నగరంలోని పోలీసు పేరేగ్రౌండ్స్ జరిగిన 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా తొలుత గౌరవ వందనం స్వీకరించిన అయన అనంతరం ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమర యోధులకు మరియు భారత రాజ్యాంగ నిర్మాతలకు నా జోహార్లు.1950 జనవరి 26న మన దేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజు అన్నారు. అహింసయే ఆయుధంగా మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, శ్రీ పొట్టి శ్రీరాములు లాంటి ఎందరో మహానుభావుల పోరాట ఫలితంగా 1947 ఆగష్టు 15వ తేదిన మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చిందన్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ జనవరి 26న “గణతంత్ర దినోత్సవం” ను జరుపుకుంటున్నామన్నారు.ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని వివరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *