AMARAVATHIPOLITICS

షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తేనే YSRCPని విలీనం చేస్తా-జగన్ ?

అమరావతి: YSRCP అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్​లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని,,ఇందులో బాగంగానే బెంగళూరుకు వెళ్లి, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్​తో జగన్ చర్చలు జరిపారని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాబోయే రోజుల్లో తన పార్టీ పరిస్థితి ఏంటో తెలియక పోవడంతో దిక్కుతోచన స్థితిలో వున్నరంటూ ఎద్దేవా చేశారు..తన సోదరి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తేనే YSRCPని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని జగన్ కండిషన్ పెట్టారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు..ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారని, అందుకే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు.. వైఎస్ జగన్ పులివెందుల పర్యటనకు వెళ్తే పార్టీ కార్యకర్తలే ఆయనపై దాడి చేశారన్నారు.. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ కనీసం పులివెందుల వైపు చూడలేదని ఎద్దేవా చేశారు..తన పార్టీ గుర్తుపైన గెలిచిన 11 మంది MLAలు, 4 MPలు కూడా జగన్ మోహన్ రెడ్డితో ఉంటారో లేదో తెలియని పరిస్థితి ఉందని నల్లమిల్లి వ్యాఖ్యానించారు.. చివరికి రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేదో తెలియదని,,అందుకే దిక్కుతోచని స్థితిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్​ పార్టీని ఆశ్రయించారని దెప్పిపోడిచారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *