ISB 20వ వార్షికోత్సవం..
హైదరాబాద్: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఇప్పటివరకు 50 వేల మంది డిగ్రీలు తీసుకుని బయటకు వెళ్లారని,,ఇక్కడ చదువును అభ్యసించిన విద్యార్థులు, దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు..గురువారం ISB 20వ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.. ISB విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని,, అనేక స్టార్టప్‌లు కూడా రూపొందించారని ప్రశంసించారు..జీ 20 దేశాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉందని,,స్మార్ట్ ఫోన్ డేటా వినియోగదారుల జాబితాలో దేశం అగ్రస్థానంలో,, ఇంటర్నెట్ వినియోగదారుల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.. స్టార్టప్‌ల రూపకల్పనలో భారత్ మూడో స్థానంలో ఉందని అలాగే వినియోగదారుల మార్కెట్లో భారత్ మూడో స్థానంలో ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు..100 సంవత్సరాల కాలంలో ఏనాడు లేని విధంగా ప్రపంచంను కబళించిన కరోనా విపత్తు సమయంలో, భారత్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందన్నారు..స్టార్టప్‌లు, సేవా రంగంలో యువత సత్తా చాటుతున్నారని,,యువత దేశాన్ని ముందుకు నడిపించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నయన్న నమ్మకం తనకు వుందన్నారు..
రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రధాని పేర్కొన్నారు..విద్యార్థులు బయటకు వచ్చాక పాలసీ విధానాలు రూపొందిస్తారని,,అయితే పాలసీ విధానాలు గదుల్లో, కాగితాలకు మాత్రమే పరిమితం కాకూడదన్నారు..మీరు రూపొందించిన విధానాలు క్షేత్రస్థాయిలో అమలైతేనే సార్థకత ఉంటుందన్నారు. దేశంలో సంస్కరణల అవసరం ఎప్పుడూ ఉంటుందని,,రాజకీయ కారణాలతో సంస్కరణల అమలు కష్టంగా మారిందన్నారు..30 సంవత్సరాలుగా రాజకీయ అస్థిరతతో అమలు కష్టమైందని,,అయితే 2014 నుంచి సంకల్పబలంతో ముందుకు వెళ్లుతున్నమన్నారు..ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్,,కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి,, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఐఎస్బీ 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పతకాలు,,పత్రాలు ప్రదానం చేశారు..
More Stories
కేసీఆర్,పీవీ జయంతికి ఎందుకు రాలేదు-బండి సంజయ్
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం
ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి