Recent Posts

భారత్ కు ఆర్దిక సాయం అందించేందుకు వర్డల్ బ్యాంకు గ్రీన్ సిగ్నల్

అమరావతి: కరోనా వైరస్ సంక్షోభంతో సతమతమవుతున్న భారత్ కు ఆర్థికసాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నలిచ్చింది..భారత్ కు నిధులు విడుదల చేయాలన్న ప్రతిపాదనకు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు అంగీకరించడంతో రూ.3,640 ($500 million) కోట్లు ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది..ఈ నిధులను భారత్ లోని మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ (MSME) రంగం అభివృద్ధికి ఖర్చు చేయాలని ప్రపంచ బ్యాంకు షరత్ విధించింది..2020 మార్చిలో ప్రవేశించిన కరోనా భారతదేశంలో ప్రజల ఆరోగ్యంతో పాటు MSME రంగాన్ని కూడా అతలాకుతలం చేసింది..ఈ క్రమంలో 5.55 వ్యాపార సంస్థలు ప్రభుత్వ నుంచి వివిధ రూపాల్లో సాయం పొందుతున్నాయి..కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో MSME ల పునరుద్ధరణకు ప్రపంచబ్యాంకు నిధులు ఉపయోగపడుతాయని ఆర్దిక విశ్లేషకులు భావిస్తున్నారు..

Spread the love