Recent Posts

53 కోట్ల విలువ చేసే హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్న మహిళ అరెస్ట్

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో దోహ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ లేడి ప్యాసింజర్ వద్ద 53 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలెజెన్స్ (DRI) అధికారులు అరెస్ట్ చేశారు..తూర్పు ఆఫ్రికా జాంబియా నుంచి భారీ మొత్తం లో మత్తు పదార్ధాలు హైదరాబాద్ కు ఎక్స్ పోర్ట్ అవుతున్నాయనే పక్కా సమాచారంతో అధికారులు కాపుకాశారు.. దోహా నుంచి వచ్చిన ఆఫ్రికా దేశస్థురాలైన మాకుంభ కరోల్”పై అనుమానం వచ్చి ఎయిర్‌పోర్ట్ లో తమదైన శైలిలో విచారణ చేయగా 8 Kgల హెరాయిన్ బయటపడ్డింది..దింతో అమెపై డ్రగ్స్ యాక్టు క్రింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు..

Spread the love