అమరావతి: పాలు కొనేవారు ఒక్కరే ఉండి అమ్మేవాళ్లు ఎక్కువ మంది ఉంటే అప్పుడు కొనేవాళ్లు ఎంత చెప్తే అంతకు అమ్మాల్సిన పరిస్ధితి ఉంటుందని,,కొనేవాళ్లు ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నా సరే,,కొనుగొలు చేసే వారంతా సిండికేట్ గా మారి ఇంత రేటుకే కొంటాం, ఇంతకన్నా ఎక్కువ కొనబోమనే పరిస్ధితి ఉన్నా అన్యాయమే జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు..బుధవారం తాడే పల్లి సీ.ఎం క్యాంపు కార్యలయం నుంచి వర్చువల్ విధానంలో కృష్ణాజిల్లాలో జగనన్న పాల వెల్లువ పథకం ప్రారంభించిన సందర్బంలో పై వ్యాఖ్యలు చేశారు..అలాగే ఇలాంటి మార్కెట్‌ను ప్రస్తుతం మన రాష్ట్రంలో చూస్తున్నామని జగన్ తెలిపారు. ఈ రెండు పరిస్థితుల్లో ఎవరు ఉన్నా,, ఉత్పత్తి చేసేవారికి అన్యాయం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుందని తెలిపారు..త్వరలోనే మిగిలిన ఏడు జిల్లాల్లో పథకం ప్రారంభం అవుతుందన్నారు.సహకార పాల ఉత్పత్తి దిగ్గజంగా పేరున్న అమూల్ రాకతో పాడి రైతులకు,, అక్కచెల్లెమ్మలకు మరింత మంచి ధర లభించనుందని తెలిపారు..
అమూల్ రాకతో పాడి రైతులకు మంచి ధర లభిస్తుంది-సీ.ఎం జగన్
