Recent Posts

విప్రొ ఉద్యోగులు సోమవారం నుంచి ఆఫీసుకి రావాలి-ప్రేమ్ జీ

అమరావతి: కరోనా కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రొమ్ హోమ్ అవకాశం కల్పించాయి.గత 18 నెలలుగా ఎక్కువమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇంటివద్ద నుంచే విధుల నిర్వహిస్తున్నారు.ఈ కంపెనీ చైర్మన్ రషీద్ ప్రేమ్ జీ..సోమవారం నుంచి ఉద్యోగులు ఆఫీసుకి రావాలని ట్విట్టర్ ద్వారా కోరారు..ఉద్యోగులకి వ్యాక్సీన్స్ చేస్తున్నమని,సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారానికి రెండు రోజులు మాత్రమే విధులకు హాజరు కావాల్సి ఉంటుందని మిగతా మూడు రోజులు ఇంటి నుంచే పనిచేయాలని వివరించారు.విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ మీడియాతో మాట్లాడుతూ మూడవ వేవ్ ప్రమాదం పొంచి ఉందని సంకేతాలు వస్తున్న నేపథ్యంలోనే ఉద్యోగులకు వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచామన్నారు. మొత్తం 2 లక్షల మంది ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారని,ఇందులో 35,000 మంది పూర్తిస్థాయి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు.విప్రో బాటలోనే బెంగుళూరు కేంద్రంగా నడుస్తున్న మరి కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు పిలిచేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Spread the love