Recent Posts

బ్రిటన్ ప్రధాని పదవీ భారతీయుడినీ వరించనున్నదా ?

అమరావతి: భారత దేశంలో వ్యాపారం చేసుకుంటామంటు పొట్ట చేతితో పట్టుకుని, సంపన్న భారతదేశంలోకి అడుగుపెట్టి,, భారతీయుల సంపాదను దోచుకున్న (బ్రిటీషర్స్) ఇంగ్లడ్ కు,,ప్రస్తుతం ఓ భారతీయుడు ప్రధాని కాబోతున్నాడా? జాత్యహంకారం తలకెక్కిన తెల్లజాతీయులు,ఓ భారతీయుడిని,వారిదేశంకు ప్రధానిగా అంగీకరిస్తారా అంటే ??…2020 మే నెలలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రధాని బోరిస్ పెద్ద ఎత్తున మందు పార్టీ చేసుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు ఆయన పదవీకి గండం తెచ్చింది..దీంతో తదుపరి ప్రధానిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతత వ్యక్తి, బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సూనక్ నియమితులవుతారని బ్రిటన్ మీడియా కథనాలు ప్రచురించింది. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రధానే నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బ్రిటన్‌లోని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ దిగిపోవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.ఈ విషయంపై ఇప్పటికే బోరిస్ జాన్సన్ క్షమాపణ చెప్పినప్పటికి,,ప్రతిపక్షాలు ససేమిరా అంటున్నాయి…దీంతో త్వరలోనే ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ తప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే.. భారత సంతతి వ్యక్తి రిషి సూనక్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉంటాయి. అన్ని సమీకరణాలు రిషి సూనక్‌కు అనుకూలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.ప్రధాని పదవీ రేసులో..విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్,   మైకేల్ గోవ్,మాజీ విదేశాంగ, ఆరోగ్య శాఖ మంత్రి జెరిమీ హంట్, ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్,ఉప ప్రధాని డొమినిక్ రాబ్ లు ఉన్నారు. వీళ్లందరిలో రిషీ సూనక్‌కే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టు మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి..ఏం జరుగుతుందో వేచి చూడాలి ?

Spread the love
error: Content is protected !!