Recent Posts

ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే అక్కడ టీడీపీ నేతలు కార్యకర్తలు ఉండాలి-అజీజ్

నెల్లూరు: ప్రభుత్వ వైఫల్యాలే టిడిపి విజయానికి నాంది అని, ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే అక్కడ టీడీపీ నేతలు కార్యకర్తలు ఉండాలనీ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు,నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు..ఆదివారం జరగనున్న నెల్లూరు కార్పొరేషన్ డివిజన్ ల టీడీపీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం లో భాగంగా, శనివారం నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్ లో అజీజ్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ వైసీపీ నేతలు బనాయించే అక్రమ కేసులకు భయపడవద్దని, నెల్లూరు రూరల్ లో వైసిపి నీటి బుడగ లాంటిదనీ అన్నారు.త్వరలోనే ఆ నీటి బుడగని పగలగొడదామని, పచ్చ జెండాను ఎగరేద్దామన్నారు.నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ నేతలు గెలిచే దమ్ము లేక దౌర్జన్యాలు, బెదిరింపులతో పాటు ఒక్కొ డివిజన్లో 50 లక్షల నుంచి 70 లక్షల వరకు ఖర్చు చేశారని వైసిపి నేతలపై ఆరోపణలు చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని ఆయన జోస్యం చెప్పారు..వైసీపీ నేతలు ఎన్ని బెదిరింపులు వచ్చిన దౌర్జన్యాలు చేసిన ఎవరు బెదరవద్దని,,తెలుగుదేశం పార్టీ తరపున తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు..వైసీపీ నేతలు చేస్తున్న అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలే తెలుగుదేశం పార్టీ విజయానికి నెల్లూరు జిల్లాలో నాంది పలుకుతుందని అజీజ్ పేర్కొన్నారు..

Spread the love
error: Content is protected !!