Recent Posts

ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నది రాజకీయం కాదు-తపస్సు-గరికపాటి

కేదార్ నాథ్‎లో ప్రధానమంత్రి..

 అమరావతి: రాజకీయాన్ని భారత జాతి ఒక తపస్సుగా భావించిందని,,రాజకీయ తపస్సు ఎలా ఉంటుందో ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో చూస్తున్నమని ప్రవచన కర్త, మహాసహస్రావధాని గరికపాటి.నరసింహారావు అన్నారు.నగరంలోని విద్యానగర్ శంకర్ మఠంలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ చేస్తున్నది రాజకీయం కాదని,,ఇది ఒక తపస్సు అని,,అందుకే ప్రపంచ దేశాలన్నీ మోడీ వైపు చూస్తున్నాయన్నారు..పరిపాలన అనేది సున్నితంగా కాని మరీ కఠినంగా ఉండకూడదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు..మంచి పాలన ప్రజలకు అందాలంటే మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు బయటకు పొక్కకూడదన్నారు.మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు రహస్యంగా ఉండబట్టే కాశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేయబడిందన్నారు.. భావవ్యక్తికరణ స్వేచ్చ వుంది కదా అని రాజ్యాంగాన్ని అతిక్రించి మాట్లాడవద్దన్నారు..పరిపాలన అనేది రాజ్యాంగం,శాస్త్ర ప్రకారం జరగాలని పేర్కొన్నారు..

కేదార్ నాథ్‎:-జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్ నాథ్‎లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. శుక్రవారం కేదార్ నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఆనంతంర కొత్తగా పునర్నిర్మించిన ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.రూ.130 కోట్లతో నిర్మించిన సరస్వతి రిటైనింగ్ వాల్, ఘాట్లు, మందాకిని రిటైనింగ్ వాల్, తీర్థ పురోహిత్ హౌస్‎లు, మందాకిని నదిపై నిర్మించిన గరుడ్ చట్టి వంతెనలను మోడీ ప్రారంభించారు.

Spread the love
error: Content is protected !!