Recent Posts

మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించకపోతే ?ఆనందయ్య స్వంతంగా మందు పంపిణీ ?

నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో పంపిణీ చేసే విషయంలో గందరగోళవం నెలకొంది..తిరిగి మందు పంపిణీ ప్రారంభించిన అనతరం ఆనందయ్య సర్వేపల్లి తరువాత చిత్తూరు జిల్లా చంద్రగిరి,ఒంగోలు జిల్లాలో బాధితులకు మందు పంపిణీ చేశారు..ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సహకారం లభించకపోవడంతో ఇతర ప్రాంతాలకు మందు సరఫరా విషయంలో ఆయన కూడా ఏమీ చేయలేక పో తున్నట్లు స్థానికులు తెలిపారు..రాష్ట్రవ్యాప్తంగా కరోనా మందు పంపిణీలో సహకారం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 7వ తేదిన లేఖ రాసినప్పటికి,ఇంత వరకూ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆనందయ్య అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..(గురువారం) నేటి  సాయంత్రం వరకూ ఎదురుచూశాక ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోతే మందు తదుపరి పంపిణీపై తన స్పందన ప్రకటిస్తానని ఆనందయ్య తెలిపారు..జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఇంటింటికీ మందు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సహకరించాలని ఆనందయ్య కోరుతున్నారు..ప్రభుత్వం సహకరించకపోతే తన సొంత ట్రస్టు సాయంతో రాష్టవ్యాప్తంగా పంపిణీకి చర్యలు తీసుకుంటానని ఆనందయ్య అన్నట్లు సమాచారం..ప్రస్తుతం కృష్ణపట్నంలో మందు తయారీ సాగుతోంది..ఇప్పటికిప్పుడు 50 వేల మంది పాజిటివ్‌ రోగులు వచ్చినా సరఫరా చేసే విధంగా మందు సిద్ధం చేశామని ఆనందయ్య తెలిపారు..కరోనా రాని వారి కోసం మందు తయారు చేయాల్సి ఉందన్నారు..మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి ??

Spread the love