Recent Posts

2030 నాటికి 23 జలమార్గాలను అందుబాటులోకి తెస్తాం-ప్రధాన మంత్రి నరేంద్రమోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మారిటైమ్ ఇండియా-2021 సదస్సును వర్చువల్ విధానంలో మంగళవారం ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మారిటైమ్ ఇండియా విజన్-2030 పుస్తకాన్ని ఆవిష్కరించారు..ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మారిటైమ్ రంగంలో భారత్ విజయాలు కొనసాగుతున్నాయన్నారు..విజయంలో భాగస్వాములు కావాలంటూ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు.. సముద్ర రంగంలో భారత్ కు గొప్ప చరిత్ర ఉందని,,దేశంలో నౌకాశ్రయాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామని,, 2030 నాటికి 23 జలమార్గాలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు..జల రవాణా మార్గాలు చౌక మాత్రమే కాదని,, పర్యావరణ హితం అని అభిప్రాయపడ్డారు..సముద్ర మార్గంలో ఆదాయాన్ని పెంపొందించేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నామని వివరించారు..పోర్టులపై 2035 నాటికి 82 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని,,ఓడరేవుల రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చెప్పారు..సముద్రరంగంలో పెట్టుబడులకు వ్యాపా వర్గాలు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు..

Spread the love