Recent Posts

లీటరు పాల ధరను రూ.12 పెంచుతాం – పాల ఉత్పత్తిదారులు

అమరావతి: పాల ధరలు ఒక స్థాయిలో పెంచాలని మధ్యప్రదేశ్ లోని పాల ఉత్పత్తిదారులు నిర్ణయం తీసుకున్నారు.. రత్లాంకు చెందిన రైతులు పాల ధర లీటరుకు రూ.12 చొప్పున పెంచాలని నిర్ణయించుకున్నమని,, గత సంవత్సంరమే లీటర్‌కు రూ.2 పెంచాలని అనుకున్నప్పటికి,, కరోనా కారణంగా పెంచలేకపోయామని తెలిపారు..ఈ ఏడాది పెట్రోల్‌,, డీజిల్‌తో పాటు దాణా ధరలు బాగా పెరిగాయని రైతులు  తెలిపారు..ప్రస్తుతం లీటరు పాలు రూ. 43కు అమ్ముతున్నామని,,మార్చి 1వ తేది నుంచి రూ.55 చొప్పున అమ్మాలని నిర్ణయించుకున్నట్లు రైతులు తెలిపారు. రత్లాంలో జరిగిన పాల ఉత్పత్తిదారుల సమావేశంలో దాదాపు 25 గ్రామాలకు చెందిన రైతులు పాల్గొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు..

Spread the love