Recent Posts

దేశ వ్యాప్తంగా నీట్-2021 పరీక్షలను సెప్టెంబర్ 12న నిర్వహిస్తాం-ధర్మేంద్ర ప్రధాన్

అమరావతిం దేశ వ్యాప్తంగా నీట్-2021 పరీక్షలను సెప్టెంబర్ 12వ తేదిన నిర్వహిస్తామని కేంద్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ పరీక్ష సమయంలో కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని,,జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు..మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు..వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1వ తేదిన నీట్ పరీక్ష జరగాల్సి ఉండగా,కరోనా కారణంగా వాయిదాపడింది..

Spread the love