Recent Posts

సమగ్రమైన సవరణలతో త్వరలోనే కొత్త బిల్లు తీసుకుని వస్తాం-సీ.ఎం జగన్

అమరావతి: వికేంద్రికరణతోనే రాష్ట్రం అభివృద్ది సాధ్యమని,తొందరలోనే గతంలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లు స్థానంలోనే మరింత సమగ్రాంగ కొత్త బిల్లు త్వరలోనే తీసుకుని వస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు..సోమవారం  ఆంధ్రప్రదేశ రాజధానిపై ప్రభుత్వం అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది  ప్రభుత్వం..సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ  బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు..గతంలో మూడు రాజధానుల బిల్లు కోసం జగన్ ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి,, ఆంధ్రప్రదేశ పాలన వికేంద్రీకరణ, సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును ప్రవేశపెట్టారు..అయితే నేడు ప్రవేశ పెట్టిన సవరణలతో తక్షణమే సీఆర్డీఏ చట్టం 2014 అమల్లోకి వస్తున్నట్లు  తెలిపారు..1)భాగస్వాములతో పూర్తి స్థాయి సంప్రదింపులు జరపకపోవడం.2)శాసనమండలిలో బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లడం లాంటి  కారణాలతో చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్దిక మంత్రి చెప్పారు..ఈ సందర్బంలో మంత్రి రద్దుకు గల కారణలు వివరిస్తు,,అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని శిమరామ కృష్ణన్ కమిటీ సూచించిందన్నారు.అమరావతి ప్రాంతం సారవంతమైన, ఖరీదైన భూమిని,,దాన్ని వృథా చేయవద్దని కమిటీ పేర్కొందన్నారు.. అనుభవాలు,చారిత్రక ఆధారాలతోనే వికేంద్రీకరణ చేశామన్నారు..రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి అన్నదే తమ ప్రభుత్వం అభిప్రాయమన్నారు..బీహెచ్ఈఎల్ లాంటి పెద్ద సంస్థలు వస్తే ప్రవేట్ సంస్థలు వస్తాయన్నారు. ఏ రాష్ట్రాలైనా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చాయన్నారు..సీ.ఎ: బిల్లుపై మాట్లాడుతూ  గత ప్రభుత్వం,,ఉమ్మడి ఏపిలో చేసిన తప్పులనే మళ్లీ చేస్తు,,అభివృద్ది అంతా ఒకే చోటే కేంద్రికరించే ప్రయత్నాలు చేసిందన్నారు.. హైదరాబాద్ లోనే అన్ని కేంద్రం ప్రభుత్వ సంస్థల పెట్టడడంతో,,ఉమ్మడి రాష్ట్రభివృద్ది అంతా హైదరాబాద్ లోనే జరిగిందని,అందుకే, రాష్ట్రం విడిపోవాల్సి వచ్చిందదన్నారు..రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి అన్నదే తమ లక్ష్యమన్నారు.. 

Spread the love
error: Content is protected !!