Recent Posts

ప్రతిభ ఆధారంగా టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు ప్రకటిస్తాం-విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు

ఆగస్టు పాఠశాలలు ప్రారంభం..

అమరావతి: విద్యార్ధుల ప్రతిభ ఆధారంగా టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు ప్రకటిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇంటర్‌, పది పరీక్షలు రద్దు చేసిన నేపధ్యంలో ఫలితాల కోసం రిటైర్డ్‌ IAS అధికారిణి ఛాయరతన్‌ కమిటీని నియమించామని,,కమిటీ నివేదిక అందగానే ఫలితాలు ప్రకటిస్తామన్నారు..ఇప్పటికే ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండ్‌ ఇయర్‌ ప్రాక్టికల్స్‌ ఫలితాల ఆధారంగా విద్యార్ధులకు శాస్త్రీయ విధానంలో గ్రేడ్‌లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నమని,,విద్యార్ధుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్‌లు ఉంటాయన్నారు..ప్రతిభ కలిగిన విద్యార్ధులకు అన్యాయం జరగకుండా చూడాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు..పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఫలితాలు కేటాయించేందుకు అధ్యయనం చేస్తున్నామన్నారు..అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని విద్యార్ధులకు ఏవిధమైన అన్యాయం జరగకుండా ఫలితాలు ప్రకటిస్తామన్నారు..అన్ని జిల్లాల్లో యూనివర్పిటీలు ఉన్నప్పటికి ప్రకాశంజిల్లాలో మాత్రం యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా గత ప్రభుత్వం విద్యార్ధులకు అన్యాయం చేసిందన్నారు..ఈ యూనివర్సిటీలోనే ప్రతిష్టాత్మకంగా దక్షిణభారత దేశంలో ఎక్కడాలేని విధంగా టీచర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు..ఆగస్టులో పాఠశాలలు ప్రారంభం:- కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆగష్టు రెండో వారం నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు..ఇప్పటికే జూలై 1వ తేది నుంచి ఉపాధ్యాయుల్ని పాఠశాలలకు రప్పిస్తున్నారు..వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి.దీంతో స్కూళ్లలో టీచర్లు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకూ పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది..

Spread the love