Recent Posts

ప్రపంచ దేశాలకు బిలియన్ వ్యాక్సీన్ లను అందిస్తాం-G 7 దేశాలు

అమరావతి: కోవిడ్19 ను ఎదుర్కొంనేందకు G 7 దేశాలు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి..  ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి ధాటికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న దేశాల‌కు బిలియ‌న్ డోసుల‌ వ్యాక్సీన్ అందించ‌బోతున్న‌ట్లు యూకే ప్ర‌క‌టించింది..G 7 లోని స‌భ్య‌దేశాలు వారి వద్ద వున్న మిగులు వ్యాక్సిన్‌ల‌ను ఇత‌ర దేశాల‌కు అందించేందుకు అంగీకరించాయని బ్రిట‌న్ ప్ర‌ధాని కార్యాల‌యం ప్ర‌క‌టించింది..బిలియ‌న్ డోసుల్లో 75 శాతం ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న కోవాక్స్ ద్వారా స‌భ్య‌దేశాల‌కు అంద‌జేయ‌నున్నారు..మిగిలిన 25 శాతం టీకాల‌ను ఇత‌ర మార్గాల్లో వివిధ దేశాల‌కు అంద‌జేస్తామని ప్ర‌క‌టించాయి..ఇప్ప‌టికే పేద దేశాల‌కు 500 మిలియ‌న్ డోసుల‌ను ఇచ్చేందుకు అమెరికా అంగీక‌రించింది..బ్రిట‌న్, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్ దేశాలు కూడా వ్యాక్సిన్ డోసుల‌ను అందించేందుకు ముందుకు వ‌చ్చాయి..  

Spread the love