Recent Posts

భారత ప్రభుత్వం మనసును నొప్పించినందుకు పశ్చాత్తాపం పడుతున్నాము-కొరియా విదేశాంగ శాఖమంత్రి

అమరావతి: హ్యుండాయ్ పాకిస్తాన్, కాశ్మీర్ వేర్పటు వాదంకు అనుకూలంగా ట్వీట్ చేసి తీవ్రవివాదంలో చిక్కుకోవడంతో హ్యుండాయ్ ఇండియా క్షమాపణలు కోరింది..దక్షిణ కొరియా విదేశాంగ శాఖమంత్రి, భారత విదేశంగా శాఖ మంత్రి జైశంకర్‌కు ఫోన్ చేశారు.. జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపపడుతున్నట్లు తెలిపారు.సామాజిక అనుసంధాన వేదిక (ట్విట్టర్, ఫేస్‌బుక్) ద్వారా భారత ప్రజలు, భారత ప్రభుత్వం మనసును నొప్పించినందుకు పశ్చాత్తాపం ప్రకటించారు. హ్యుండాయ్ పాకిస్తాన్ ట్వీట్ పైన భారత్ తీవ్రంగా స్పందిస్తూ, కొరియా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.మంగళవారం భారత్‌లోని దక్షిణ కొరియా రాయబారిని పిలిపించి ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.. హ్యుందాయ్ పాకిస్తాన్ నుండి ఆమోదయోగ్యం కానీ సోషల్ మీడియా పోస్ట్ పైన భారత ప్రభుత్వ తన అసంతృప్తిని వ్యక్తం చేసిందని, ఈ అంశం భారత దేశ ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన అంశమని, ఇందులో రాజీపడనట్లు తెలిపిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని దక్షణ కొరియాలోని భారత అంబాసిడర్ అరిందమ్ బాగ్చీ అన్నారు..ఈ నేపథ్యంలో విదేశంగా శాఖ మంత్రి  జైశంకర్ స్పందిస్తూ,,కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఇయు యోంగ్ నుండి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, హ్యుండాయ్ విషయం చర్చించారని తెలిపారు..

Spread the love
error: Content is protected !!