Recent Posts

కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించాలని ఇకపై యూజర్లపై ఒత్తిడి తీసుకునిరాము-వాట్సాప్

అమరావతి: వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించాలని ఇకపై యూజర్లపై ఒత్తిడి తీసుకురాబోమని ఢిల్లీ హైకోర్టుకు,వాట్సాప్ స్పష్టం చేసింది..సమాచార భద్రతా బిల్లు (డేటా ప్రొటెక్షన్ బిల్లు) అమల్లోకి వచ్చేంత వరకు ప్రైవేట్ పాలసీ విధానంపై యూజర్లను బలవంత పెట్టబోమని స్వచ్ఛందంగా పేర్కొంది..అలాగే వినియోగదారులకు ఎలాంటి సేవలు నిలిపివేయమని కోర్టుకు తెలిపింది..తమ సంస్థ నిబంధనల ప్రకారం (optional) ఐచ్చకంగా వినియోగదారుడు అప్‌డేట్ చేసుకోవాలనే మెసేజ్‌ను మాత్రం డిస్‌ప్లే చేస్తామని వివరణ ఇచ్చింది..గతంలో తమ ప్రైవసీ పాలసీని యూజర్లు అంగీకరించకపోతే సేవలు నిలిపివేస్తామని వాట్సాప్ బెదిరించిన  సంగతి యూజర్లకు గుర్తువుండేవుంటది..కేంద్ర ప్రభుత్వం విధానలకు వాట్సాప్ దిగి రాగా ఇక మిగిలింది ట్వీట్టర్ మాత్రమే..అది కూడా చూద్దాం… 

Spread the love