Recent Posts

వరద వల్ల నష్ట పోయిన ప్రతి ఒక్కరిని తప్పకుండా ఆదుకుంటాం-ధైర్యంగా ఉండండి-సీ.ఎం జగన్

అమరావతి: వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించిన సీ.ఎం, స్వయంగా వరద బాధితులతో మాట్లాడారు.అన్ని విధాలుగా ఆదుకుంటానని, వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారిని తప్పకుండా ఆదుకుంటామని,నేనున్నా..ధైర్యంగా ఉండండి..అంటూ వరద బాధితులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు..గురువారం సీఎ జగన్ కడప జిల్లాలో పర్యటించారు.వరద ప్రాంతాల్లో కాలినడకన వెళ్లి..బాధితులను ఆయన పరామర్శించారు. ఉదయం 9.30గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప జిల్లాకు చేరుకున్న సీఎం రాజంపేట,పుల్లపొత్తూరు గ్రామానికి పచేరుకున్నారు.అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులతో మాట్లాడారు.అనంతరం ఎగమందనపల్లి..వెళ్లి వరద ప్రభావానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో కాలినడకన పర్యటించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్ కు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు.వరదలతో సర్వం కోల్పోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఇళ్లు కోల్పోయిన బాధితులు వేడుకున్నారు.రూ.90 వేల సాయం సరిపోదని, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధితులు కోరారు.ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత నాదేనని, అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.అనంతరం వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ఆయన పరిశీలించారు.అనంతరం చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు.. తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్‌కు వెళ్లి వరద బాధితులతో మాట్లాడారు.అనంతరం రేణిగుంట మండలం, వెదల్లచెరువు గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గృహాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు.సాయంత్రం 6 గంటలకు వరదనష్టం, సహాయ, పునరావాసచర్యలపై తిరుపతిలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు..రాత్రి పద్మావతి అతిధి గృహంలో బసచేయనున్నారు..

Spread the love
error: Content is protected !!