Recent Posts

మన పేరు మీద ఎన్ని ఫోన్ నెంబర్లు లింక్ అయిన విషయం తెలిసిపోతుంది-విజయ్ శేఖర్ శర్మ

అమరావతి: మన పేరు మీద ఎన్ని సిమ్‌ కార్డ్‌ లు వున్నాయి ? లేక వేరే ఏవరైన దుర్వినియోగం చేస్తున్నరా ? అనే విషయం వినియోగదారుడు గుర్తించేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ ‘TAF-COP’ అనే పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది..ఆధార్ కార్డు కేవలం ఐడెంటిటీ ప్రూఫ్‌, అడ్రస్‌ ప్రూఫ్‌ మాత్రమే కాకుండా అనేక పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేస్తున్నాయి.అదే సమయంలో ఆధార్‌కు ఫోన్‌ నెంబర్‌ యాడ్‌ చేయడం తప్పని సరి చేశాయి. ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం ద్వారా ఆథెంటికేషన్ సులభమౌవుతుంది..ఇదే సమయంలో ఈ విధానం ఫోన్‌ వినియోగదారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. సైబర్‌ నేరస్తులు ఆధార్‌ కార్డ్‌, ఫోన్‌ నెంబర్‌ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు.ఆన్ లైన్ ఆర్దిక నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంతో కేంద్రం వెబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.www.tafcop.dgtelecom.gov.in టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అని పిలిచే ఈ పోర్టల్‌లో లాగిన్‌ అయితే మన ఆధార్‌ కార్డ్‌ మీద ఏ ఫోన్‌ నెంబర్‌ ను యాడ్‌ చేశాం. మన పేరు మీద ఎన్ని సిమ్‌ కార్డ్‌ లు ఉన్నాయనే విషయాన్ని ఈజీగా గుర్తించవచ్చు.TAF-COP వెబ్‌ పోర్టల్‌ వినియోగంపై పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.ఉపయోగంలో లేని సిమ్‌ కార్డ్‌ లను బ్లాక్‌ చేయవచ్చు.. సైబర్‌ నేరస్తుల నుంచి సురక్షితంగా ఉండొచ్చని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Spread the love