Recent Posts

నిజమే విడిపోయేందుకు నిర్ణయించుకున్నాం! నాగచైతన్య

హైదరాబాద్: అక్కినేని కుటుంబలో విడాకులు విషయంలో కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి నాగచైతన్య తెర దించేశాడు.శనివారం మధ్యాహ్నం నాగచైతన్య తన విడాకుల వార్త నిజమేనంటూ ట్వీట్ చేశాడు.భార్యాభర్తలుగా తమ బంధాన్నిఇక మీదట కొనసాగించడం లేదని తెలిపారు..దశాబ్దానికి పైగా తమ మధ్య ఏర్పడిన స్నేహబంధం గొప్పదని పేర్కొన్నాడు..తొలిసారి నాగచైతన్య తమ విడాకుల గురించి మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు అయ్యింది..నాగచైతన్య పోస్టు చేసిన సెమ్ మేటర్ నే సమంత పేరు మార్చి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది..ఇప్పటి వరకూ వీరిద్దరి మధ్య అవగాహన బాగానే వున్నట్లు తెలుస్తుంది..మరి రాబోయే రోజుల్లో ఈ స్నేహబంధాన్ని ఇలానే కొనసాగిస్తారో లేదో చూడాలి..అవగాహనతోనే:- సమంత సన్నిహితుల నుండి వచ్చిన సమాచారం ప్రకారం వారు ఇప్పటికే మ్యూచువల్ అండర్ స్టాండింగ్ లో విడాకులకు అప్లయ్ చేసినట్లు తెలుస్తుంది..కోర్టు నుండి ఆదేశాలు రావడమే ఆలస్యం అంటున్నారు.ఈ నేపథ్యంలోనే సమంతకు భరణంగా నాగార్జున ఫ్యామిలీ 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడిందని,,అయితే ఆ ఆఫర్ ను సమంత సున్నితంగా తిరస్కరించిందనే పుకార్లూ వినిపించాయి..ఏది నిజమో నిలకడపై తెలుస్తుంది? 

Spread the love