అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,08,755 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15 జూన్ 14 కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేలు చొప్పున దాదాపు రూ.109 కోట్ల ఆర్ధిక సాయంతో పాటు ఓఎన్జీసీ సంస్ధ పైప్‌లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.108 కోట్ల ఆర్ధిక సాయంతో కలిపి మొత్తం రూ.217 కోట్లు కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు..శుక్రవారం కోనసీమ జిల్లా మురమళ్ళ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ వరసగా నాలుగో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా అందచేయడం జరిగిందని,,మత్స్యకారుల అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా ఇచ్చిన ప్రతి హామీని బాధ్యతగా ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.. గతంలో డీజిల్ ఆయిల్‌పై సబ్సిడీ లీటర్‌కు రూ. 6.03 ఉంటే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రూ. 9 కి పెంచడమే కాక స్మార్ట్ కార్డులు జారీ చేసి డీజిల్ పోయించుకునేటప్పుడే సబ్సిడీ లబ్ధి వారికి అందేలా ఏర్పాటు చేశామన్నారు..వేట చేస్తూ మరణించిన మత్స్యకార కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు..
మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూన్నాం-సీ.ఎం జగన్
