Recent Posts

వొడాఫోన్‌ ఐడియా షేర్లను కేంద్ర ప్రభుత్వంకు అప్పగించిన కంపెనీ

అమరావతి: దేశంలో మూడో అతి పెద్ద మొబైల్ ఫోన్‌ ఆపరేటర్‌గా ఉన్న వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ కీలక ప్రకటన చేసింది..కంపెనీలోని మేజర్‌ వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది.. కంపెనీ బకాయిలను ఈక్విటీగా మార్చిన తర్వాత వొడాఫోన్ ఐడియాలో 35.8 శాతం వాటా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది.ఈ పరిణామం వ్యవస్థాపకులతో సహా కంపెనీ ప్రస్తుత షేర్‌హోల్డర్లందరికీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు..స్పెక్ట్రమ్​ చెల్లింపులు, ఏజీఆర్​ బకాయిల రూపంలో ప్రభుత్వానికి రూ.1.6 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది..ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల వడ్డీ రూ.16వేల కోట్లుగా ఉంటుంది.2021, ఆగస్టు 14 తేదీ నాటికి కంపెనీ షేర్ ధర​ ముఖ విలువ కన్నా తక్కువ ఉంది..టెలికాం నియంత్రణ సంస్థ తుది నిర్ణయం మేరకు ప్రభుత్వానికి ఒక్కో షేర్​ రూ.10 చొప్పున అప్పగించనున్నమని,,ఈ ప్రక్రియతో మా సంస్థలో ప్రభుత్వానికి రూ.35.8 శాతం షేర్లు అందుతాయని పేర్కొన్నారు..వొడాఫోన్​ గ్రూప్​నకు 28.5 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్​నకు 17.8శాతం షేర్లు ఉంటాయి..2021, సెప్టెంబర్​ 30 నాటికి వొడాఫోన్​ ఐడియా అప్పులు మొత్తం రూ.1,94,780 కోట్లుగా కాగా అందులో స్పెక్ట్రమ్​ చెల్లింపులు రూ.1,08,610, ఏజీఆర్​ బకాయిలు రూ.63,400 కోట్లుగా ఉన్నాయి..

Spread the love
error: Content is protected !!