Recent Posts

విరాట్ కోహ్లీ త్రాగే లీటర్ మంచినీరు ఖరీదు రూ.4 వేలు!

అమరావతి: క్రీడల్లో రాణించాలంటే ఫిట్ నెస్ తప్పని సరి లేదంటే జట్టులో వున్న స్థానం కొల్పోవడం ఖాయం.. అలాంటిది టీమిండియా జట్టులో వుండాలంటే ఎంత ఫిట్ గా వుండాలో కెప్లెన్ విరాట్ కోహ్లీ బాగా తెలుసు. ఫిట్ నెస్ కోసం తన ఆహారపు ఆలాట్లతో పాటు మంచినీటి విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఇందులో భాగంగానే మినరల్ వాటర్ కి బదులు ‘బ్లాక్ వాటర్’ తీసుకుంటున్నాడు.ఈ వాటర్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుంది. కరోనా ప్రారంభం నుంచి కోహ్లీ ఈ వాటర్ తాగడం మొదలు పెట్టాడు.మాములు మినరల్ వాటర్ లీటర్ రూ.20 నుంచి రూ.40 వరకు ఉంటుంది.అదే బ్లాక్ వాటర్ లీటర్ ధర రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఉంటుంది..బ్లాక్ వాటర్ లో నేచురల్ ఆల్కలైన్ ఉంటుంది.ఆల్కలైన్ వ్యక్తి శరీరాన్ని ఫిట్ గా, హైడ్రేటెడ్ గా ఉంచుతుందట.దీంతో జీర్ణప్రక్రియ, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.మనం తాగే నీటిలో పీహెచ్ స్థాయి 7గా ఉంటే,, బ్లాక్ వాటర్ ఇంకా ఎక్కువ ఉంటుంది.ఈ వాటల్ లో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉండడంతో, మన చర్మం యవ్వనంగా ఉండేందుకు తోడ్పడుతుందని కంపెనీ పేర్కొనండంతో కోహ్లీ ఈ బ్లాక్ వాటర్ వాడుతున్నాడు..

Spread the love