Recent Posts

నవంబరు 13, 14, 15వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం..

తిరుమల: తిరుప‌తి న‌గ‌రంలో నవంబరు 14వ తేదీన ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌మావేశం ఉన్న నేప‌థ్యంలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేసినట్లు టిటిడి ప్రకటించింది.ఈ కారణంగా నవంబ‌రు 12, 13 14వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని,, 13, 14, 15వ తేదీల్లో దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండవని పేర్కొన్నారు..భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది..

పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం:-తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగానే సమకూరుతూది వుంది.కరోనా కారణంగా ఖాళీ అయిన ఖజానా నిండుతోంది.నవంబర్ 5వ తేదీన శ్రీవారిని 29,586 మంది భక్తులు దర్శించుకోగా, 13,507 మంది తలనీలాలు సమర్పించారు..దీంతో శ్రీవారి హుండీ ఆదాయం 2.15 కోట్లు అని టీటీడీ తెలిపింది.. అక్టోబర్ నెలలో వెంకటేశ్వరస్వామిని 8,12,818 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 3,77.970 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. స్వామివారి హుండీ ఆదాయం రూ.79 కోట్ల 10 లక్షల లభించింది..శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాల్సి వుంటుంది..నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన టోకెన్ల సంఖ్యను పెంచింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు,,రోజుకు 12వేల చొప్పున,,సర్వదర్శన 10వేల చొప్పున విడుదల చేశారు..

Spread the love
error: Content is protected !!