Recent Posts

భారతదేశంలోని ఉష్ణోగ్రతలకు అనుగుణంగా వ్యాక్సీన్ తయారీ-ప్రొఫెసర్ శేషాద్రి వాస‌న్

అమరావతి: క‌రోనా వైరస్ ను నిలవరించాలంటే,వ్యాక్సీనేషన్ తప్ప మరో దారి లేని పరిస్థితి..ఇప్పటి వరకు వివిధ సంస్థలు తయారు చేసిన వ్యాక్సీన్స్ ను ఖచ్చితంగా శీత‌లీక‌ర‌ణ గిడ్డంగుల్లో భ‌ద్ర‌ప‌ర‌చాల్సి వస్తుంది..దేశంలో  అందుబాటులో ఉన్న కోవాగ్జిన్‌,, కోవీషీల్డ్ టీకాలు 2నుంచి 8 డిగ్రీల వ‌ర‌కు టెంపరేచర్ వద్ద నిల్వ వుంచాలి..అదే అమెరికా సంస్థలైన ఫైజ‌ర్‌,,మోడెర్నా టీకాల‌ను మైన‌స్ 70 డిగ్రీల వ‌ద్ధ స్టోర్ చేయాలి..ఇలాంటి పరిస్థితి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సీన్ చేయలంటే,ఫ్రంట్ లైన్ వారియర్స్ వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారు..మన దేశంలో ఉష్ణోగ్ర‌తలు అధికంగా ఉంటాయి.దేశీయ వాతావ‌ర‌ణానికి త‌గిన విధంగా టీకాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భార‌త్‌కు చెందిన ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌,,ఆస్ట్రేలియాకు చెందిన మైన్‌వ్యాక్స్‌ సంస్థ‌లు క‌లిసి ఓ టీకాను అభివృద్ధి చేసింది..ఈ వ్యాక్సీన్ అన్ని ర‌కాల కరోనా వేరియంట్ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటుంద‌ని, 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో నెల రోజుల‌పాటు నిల్వ ఉంటుందని, 100 డిగ్రీల వేడిలో 90 నిమిషాల వ‌ర‌కూ టీకా దెబ్బతినకుండా ఉంటుందని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ శేషాద్రి వాస‌న్ పేర్కొన్నారు..త్వరలోనే ఇండియాలో ట్ర‌య‌ల్స్‌ ను నిర్వహిస్తామని తెలిపారు..  

Spread the love