Recent Posts

రాష్ట్రంలో వ్యాక్సిన్ పాస్‌ను ప్రవేశపెట్టవచ్చు-ప్రజారోగ్య డైరెక్టర్

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తీసున్నవారిని మాత్రమే బహిరంగ ప్రదేశాలల్లో అనుమతించాలని, టీకా తీసుకున్న వ్యక్తులకు మాత్రమే మాల్స్, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు వంటి బహిరంగ ప్రదేశాలల్లో అనుమతించాలని తెలంగాణ ప్రజారోగ్య డైరెక్టర్ జి శ్రీనివాసరావు సూచించారు. ఇందుకోసం రాష్ట్రంలో వ్యాక్సిన్ పాస్‌ను ప్రవేశపెట్టవచ్చని తెలిపారు.తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి.దీంతో గాంధీ సహా వివిధ ఆస్పత్రుల్లో బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు.దింతో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు డైరెక్టర్ శ్రీనివాసరావు..థర్డ్ వేవ్ హెచ్చరికల క్రమంలో ప్రజలు కరోనా రూల్స్ తప్పకుండా పాటించాలన్నారు.ఇప్పటికే పలు దేశాలు ఈ విధంగా చర్యలు తీసుకున్నాయని,తాము కూడా అలాంటి కఠినమైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి క్లిష్టంగా మారే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.అయితే థర్డ్ వేవ్ రాకుండా ప్రజలు తప్పనిసరిగా సొంత జాగ్రత్తలు పాటించాలని కోరారు..ప్రజలు ఇంట్లో ఉన్నా బయటకి వెళ్లినా మాస్కులు ధరించాలని సూచించారు.

Spread the love