Recent Posts

అల్లకల్లోలంగా ఉత్తరాఖండ్-భారీ వర్షాల కారణంగా 23 మంది మృతి

అమరావతి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి..వరదనీటితో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా వరద ఉధృతికి పలు చోట్ల వంతెనలు కొట్టుకుని పోయాయి.అలాగే మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి..ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదల కారణంగా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. నైనిటాల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నైనిటాల్ సరస్సు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అనేక గ్రామాలు నీటమునిగిపోయాయి.రాంగఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి.వందలాది మంది పర్యాటకులను సహాయక బృందాలు కాపాడాయి.చంపావత్ ప్రాంతంలో చల్తీ నదికి వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది..భారీ వర్షాలు, వరదల కారణంగా కేదారనాథ్, బధ్రీనాథ్ యాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు.ఆలయాలకు వెళ్తూ మార్గమధ్యంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు..వరద ఉధృతి తగ్గిన తర్వాతే యాత్రికులను, పర్యాటకులను అనుమతిస్తామని ఉత్తరాఖండ్ అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ వర్షాలు, వదర పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర సింగ్ దామి, కేంద్రమంత్రి అజయ్ భట్ లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు.

Spread the love
error: Content is protected !!