Recent Posts

బయోఫ్లాక్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ పద్ధతిలో జరుగుతున్న రొయ్యల సాగును పరిశీలించిన కేంద్ర మంత్రి

నెల్లూరు: ఒకరోజు జిల్లా పర్యటనకు గురువారం విచ్చేసిన కేంద్ర మత్స్య, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి డాక్టర్ యల్ మురుగన్ తోటపల్లిగూడూరు మండలం కొత్త కోడూరు సమీపంలో బయోఫ్లాక్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ పద్ధతిలో చేపడుతున్న రొయ్యల సాగును పరిశీలించారు. అనంతరం రొయ్యల సాగుచేస్తున్న యజమాని నిషాంత్ రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ పద్ధతుల్లో రొయ్యల సాగు చేస్తే ఒక హెక్టారుకు 5 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని, అదే  బయోఫ్లాక్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ పద్ధతిలో సాగు చేస్తే ఒక హెక్టారుకు 160 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి నెల్లూరు రూరల్ మండల పరిధిలోని ధనలక్ష్మీ పురంలో ఉన్న ఫ్రెష్ ఫిష్ దుకాణాలను పరిశీలించారు. కేంద్ర మంత్రి పర్యటనలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వర రావు, వారి సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, కేంద్ర ప్రభుత్వ మత్స్యశాఖ సెక్రెటరీ  బాలాజీ, జాయింట్ కలెక్టర్  హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, ఆప్కాబ్ చైర్మన్ అనిల్ బాబు, కోస్టల్ ఆక్వాకల్చర్ అధారిటీ డైరెక్టర్ ఆంటోనీ, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, ఏడిలు ప్రసాద్, చాంద్ భాషా, శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.

Spread the love