తీరం దాటిన ఫెంగల్ తుఫాన్!
అమరావతి: శనివారం సాయంత్రం దాదాపు 4 గంటల తరువాత ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్ – మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో ఫెయింజల్ తుపాను తీరం దాటిందని సమాచారం.. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తున్నాయి..అలాగే దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి సహా ఏడు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి..తీరం వెంబడి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి..