Recent Posts

ముంబై నగరవాసులను హ‌డ‌లెత్తిస్తున్నతౌక్టే తుఫాన్

అమరావతి: తౌక్టే తుఫాన్ ముంబై నగరవాసులను హ‌డ‌లెత్తిస్తోంది..ఒక వైపు క‌రోనా సెకండ్ వేవ్ ధాటికీ పాజిటివ్ కేసులు,,మరో వైపు తుఫాన్ తీరానికి చేరువ కావడంతో భారీ అల‌లు తీరాన్నితాకుతు ముంబైలో భయాన‌క వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది..స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మార‌డంతో తీరం వెంబ‌డి రాకాసి అలలు ఎగిసిప‌డుతున్నాయి..ఇదే సమయంలో భారీ వ‌ర్షాలతో నగరంలోని రహదారులు వర్షం నీటితో చెరువులను తలపిస్తున్నాయి..దాదాపు గంటకు దాదాపు 120 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు విరుచుకుప‌డుతున్నాయి..ముంబై విమాన‌స‌ర్వీసుల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది.. ముంబైలో ల్యాండ్ కావాల్సిన ప‌లు విమానాల‌ను ఇత‌ర ప్రాంతాల‌కు మ‌ళ్లించారు..మరి కొన్ని విమానాలను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ కు మ‌ళ్లించారు..ముంబైలో ఈదురు గాలులు,,భారీ వ‌ర్షంతో ప‌లు ప్రాంతాల్లో చెట్లు,,విద్యుత్ స్తంభాలు కూలిపోవ‌డంతో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది..ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించిపోయింది..తౌక్టే తుఫాన్ తీరందాటిన తరువాత ఏర్పాడే పరిస్థితులను ఎదుర్కొందుకు ప్రభుత్వం RDF బృందాలు సిద్దంగా వుంచింది..

Spread the love