Recent Posts

తెలంగాణ బార్డర్ వద్ద అంబులెన్స్ లోనే ఇద్దరు కరోనా బాధితులు మృతి

కర్నూలు: హైదరాబాద్ హాస్పిటల్స్ లో బెడ్ కన్ఫర్మ్ అయితేనే ఎంట్రీ ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది..దింతో తెలంగాణ పోలీసులు కర్నూల్ జిల్లా పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద నుంచి తెలంగాణలోకి అంబులెన్స్‌ లు ప్రవేశించేదుంకు నిరాకరించడంతో,,అంబులెన్స్ లు భారీగా నిలిచిపోయాయి..శుక్రవారం ఉదయానికి దాదాపు 30కి పైగా బెడ్ బెర్త్ ఖరారు కానీ అంబులెన్స్‌ లను,,తెలంగాణ పోలీసులు వెనక్కి పంపారు..తెలంగాణ ప్రభుత్వ పాసులున్న కొన్ని అంబులెన్స్‌ లను కూడా పోలీసులు,,ఆరోగ్యశాఖాధికారులు అనుమతించడంలేదు.. దింతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి..ఎంతకి పోలీసులు అంబులెన్స్‌ లను అనుమతించకపోవడంతో,,నంద్యాల, కడప జిల్లాలకు చెందిన ఇద్దరు కరోనా పేషంట్లు అంబులెన్స్‌ లలోనే మృతిచెందారు..దింతో పుల్లూరు టోల్ ప్లాజా వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది..పేషంట్ల బంధువులు పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు..

Spread the love