Recent Posts

జూన్ 1వ తేది నుంచి అలిపిరి న‌డ‌క‌మార్గం రెండు నెల‌ల పాటు మూసివేస్తున్న టీటీడీ!

తిరుపతి: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి అలిపిరి న‌డ‌క‌మార్గం రెండు నెల‌ల పాటు మూసివేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది..పైక‌ప్పు నిర్మాణం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో జూన్ 1వ తేదీ నుంచి జులై 31వ తేదీ వ‌ర‌కు అలిపిరి నడకమార్గం మూసివేస్తున్న‌ట్టు టీటీడీ ప్ర‌క‌టించింది..25 కోట్ల రూపాయల వ్యయంతో నడకమార్గంలో పైకప్పు నిస్మిస్తున్న‌ట్టు చెబుతున్నటీటీడీ అధికారులు,, ప్రత్యామ్నాయంగా భక్తులు శ్రీవారి మెట్టు న‌డ‌క మార్గాన్ని వినియోగించు కోవాలని సూచిస్తున్నారు.. తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తులు.. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో వెళ్తుంటారు..న‌డ‌క‌మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం కూడా మొక్కుగా న‌మ్ముతారు..శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గంలో కూడా మ‌రికొంత మంది వెళ్తుంటారు..ప్రస్తుతం అలిపిరి మెట్ల మార్గం మూసివేయ‌డంతో,, శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గంలోనే భక్తులు వెళ్లాల్సి ఉంటుంది..

Spread the love