అమరావతి: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ శనివారం రాజీనామా చేశారు..రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన బీజేపీ అధ్యక్షడు జేపీ నడ్డా,, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు..త్రిపుర అసెంబ్లీలో 60 స్థానాలకు గాను 35 స్థానాలతో బీజేపీ అధికారం చేపట్టింది..ఇటీవల బీజేపీ ఎమ్మెలేలు సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్ సాహా ఇటీవల పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు..దీంతో బీజేపీ బలం 33కు తగ్గింది..మ్యాజిక్ ఫిగర్ కు రెండు స్థానాలు మాత్రమే బీజేపీకి ఎక్కువగా ఉన్నాయి..రాబోయే సంవత్సరం త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిప్లవ్ రాజీనామా చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ శనివారం రాజీనామా
