Recent Posts

నెల్లూరులో అదుపు తప్పిన ట్రాక్టరు-5 మంది మృతి

అమరావతి: నెల్లూరు రూరల్  పరిధిలో మంగళవారం ఘోర రోడ్డు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది..గొల్లకందుకూరు సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పడంతో,రోడ్డు ప్రక్కనే వున్న చేపల చెరువులో పడింది..ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు..వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న వీరంత సమీప గ్రామంకు చెందిన వారే అని తెలుస్తుంది..దగ్గర గ్రామంలోని పుచ్చకాయ తోటల్లో పనికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలంకు చేరుకుని,,మరణించిన వారిని పోస్టుమార్టంకు తరలించి,,కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు..మరణించిన వారి వివరాలు ఇలా వున్నాయి..పాక కృష్ణవేణి(26), కిలారి హరిబాబు(43), లాలి లక్ష్మీ కాంతమ్మ(45), అబ్బుకోటి పెంచలయ్య(60), తాంధ్రా వెంకటరమణమ్మ (19)లుగా గుర్తించారు..

Spread the love