Recent Posts

నేడు భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం

అమరావతి: శ్రీశైల క్షేత్రంలో చైత్రమాస శుక్రవారం (నేడు) రోజున భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం..కొవిడ్ నిబంధనలను అనుసరించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.. ఉత్సవాలను పురస్కరించుకుని భ్రమరాంబదేవి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు..భ్రమరాంబ దేవికి కొబ్బరికాయలు,,నిమ్మకాయలు,,గుమ్మడి కాయలు మొదటి విడత సాత్విక బలిగా సమర్పించనున్నారు.. సాంప్రదాయాన్ని అనుసరించి “ స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు” అమ్మవారికి కుంభహారతి సమర్పించడంతో ఉత్సవ ప్రధాన ఘట్టం ప్రారంభం కానున్నది..

Spread the love