Recent Posts

తల్లీబిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు-“YSR తల్లీబిడ్డ ఎక్స్‌ ప్రెస్‌” వాహనాలు-సీ.ఎ: జగన్

అమరావతి: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు అధునాతన వసతులతో కూడిన 500 ‘వైఎస్​ఆర్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను ముఖ్యమంత్రి జగన్,శుక్రవారం విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు..ఈ సందర్భంగా సీ.ఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో అరకొరగా ఉన్న తల్లీ బిడ్డ ఎక్స్‌ ప్రెస్ వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రారంభించామని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు,,ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్న తలంపుతో అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు..ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,057 ప్రభుత్వాస్పత్రుల్లో ఏడాదికి సగటున నాలుగు లక్షల ప్రసవాలు జరుగుతుంటాయని,,తల్లీ బిడ్డ ఎక్స్‌ ప్రెస్ వాహనాల ద్వారా నెలలు నిండిన గర్భిణీలను కాన్పు కోసం ఇంటి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లి,, ప్రసవం అనంతరం మళ్లీ సురక్షితంగా ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుస్తారని తెలిపారు..తల్లులకు సాయం అందంచేందుకు వీలుగా కేంద్రీకృత 102 కాల్ సెంటర్ సేవలను కూడా ప్రభుత్వం మెరుగుపరిచిందని పేర్కొన్నారు..

Spread the love
error: Content is protected !!