Recent Posts

ప్రధాని గడ్డం గీయించుకోవాలంటు రూ.100 పంపిన టీవాలా అనిల్ మోరే

అమరావతి: గడ్డం గీసుకోమని సూచిస్తూ ఓ వ్యక్తి, ప్రధాని నరేంద్ర మోదీకి వంద రూపాయలు పంపించిన ఘటన చర్చనీయశం అయింది.. మహారాష్ట్ర,బారామతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎదురుగా టీ స్టాల్ నడుపుతున్న అనిల్ మోరే ప్రధానికి తన ఆవేదన తెలియచేసేందుకు విన్నూత మార్గంగా ఈ పద్దతిని ఎంచుకున్నాడు..ప్రధాని నరేంద్రమోదీ గడ్డం పెంచుతున్నారు.. ఆయన ఇకపై ఏదైనా పెంచాలనుకుంటే, అది ఈ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేది అయి ఉండాలి.. దేశ జనాభాకు వీలైనంత వేగంగా టీకాలు వేయిండానికి,, వైద్య సదుపాయాలను పెంచడానికి ఆయన ప్రయత్నాలు చేయాలి.. గత 15 నెలలుగా దేశంలోని అసంఘటిత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..చివరి రెండు లాక్‌డౌన్‌ల వల్ల కలిగిన కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపైనే ప్రధాని దృష్టి సారించాలని ఆ లేఖలో మోరే పేర్కొన్నాడు..దేశ ప్రధాని అంటే ఎంతో గౌరవం, అభిమానం అని,,తాను దాచుకున్న డబ్బుల్లో నుంచి ఆయనకు రూ.100 పంపుతున్నానని,, ప్రధాని గడ్డం గీయించుకోవాలని కోరారు..ఆయన ఈ దేశ అత్యున్నత నాయకుడు..ఆయన్ని అవమానించడం, బాధపెట్టడం నా ఉద్దేశం కాదని స్పష్టంచేశారు..మహమ్మారి వల్ల రోజు రోజుకు ఈ దేశ పేదలు పడుతున్న ఇబ్బందులను ఆయనకు తెలియజేయాలనుకుంటున్నా అని పేర్కొన్నారు.

Spread the love