Recent Posts

ప్రమాదకర స్థితిలో తిరుపతి రాయల చెరువు

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం..కలెక్టర్

తిరుపతి: నగర శివారులో రామచంద్రాపురం వద్ద ఉన్న రాయల చెరువు కట్ట ఏ క్షణంలోనైనా తెగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..చెరువుకట్ట నుంచి మట్టి జారుతుండడంతో, పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో రాయల చెరువు ప్రాంతం పరిధిలో రాకపోకలను అధికారులు నిలిపివేశారు..కట్టలో అక్కడక్కడ నీరు లీకేజీ అవుతోందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు..ప్రస్తుతం చెరువును మరమ్మత్తు చేసే అవకాశాలు లేనందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు.రాయల చెరువు కింద కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి..చెరువు నిర్మించినప్పటి నుంచి ఈ స్థాయిలో నీరు రాలేదని గ్రామస్థులు అంటున్నారు.
గ్రామాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు:- వరద నీరు గరిష్ట స్థాయికి చేరడంతో,చెరువు కట్టకు స్వల్ప గండి పడింది.. సంతబైలు, ప్రసన్న వెంకేటశ్వరపురం, నెన్నూరులో అప్రమత్తత గంగిరెడ్డిగారిపల్లి, సంజీవరాయపురం, కమ్మపల్లి, గొల్లపల్లె, కమ్మకండ్రిగ, నడవలూరులో అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇదే సమయంలో వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరులో  పల్లెలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు. చెరువు కట్ట దగ్గర పరిస్థితిని కలెక్టర్ హరినారాయణ్,,ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న,,తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పర్యవేక్షిస్తున్నారు.

Spread the love
error: Content is protected !!