Recent Posts

తిరుపతి కంటైన్ మెంట్ జోన్-రేపటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే-కమీషనర్ గిరీషా

తిరుపతి: తిరుపతి పట్టణంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంక్షలు కఠినతరం చేస్తు తిరుపతి పట్టణాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషా ప్రకటించారు..మంగళవారం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరచి వుంటాయి..తిరుపతికి వచ్చే భక్తులు కూడా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు కమిషనర్..తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వ్యాపార సంఘాలు, ఆటో, జీపు డ్రైవర్ల యూనియన్లతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, నగరపాలక కమిషనర్‌ గిరీషా, ఎస్పీ వెంకటప్పలనాయుడు సమావేశమయ్యారు..కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ తీసుకోవడంతో పాటు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై సుదీర్ఘంగా చర్చించారు..తిరుపతి మార్కెట్ ని నగరంలో ఏడు ఎనిమిది చోట్ల డీ సెంట్రలైజ్ చేస్తామన్నారు. ఆటోలు, జీపుల్లో పరిమిత సంఖ్యో ప్రయాణికులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. గంగమ్మ జాతరను ఏకాంతంగా జరిపేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు..కరోనా కట్టడికి సహకరించేందుకు దుకాణాలు స్వచ్ఛంధంగా మూసివేసేందుకు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ నిర్ణయం తీసుకుంది..

Spread the love