Recent Posts

రెండురోజుల పాటు తిరుమల నడకదారి మూసివేత

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. రెండు రోజుల పాటు(17,18) తిరుమలకు వెళ్లే రెండు నడకదారులను మూసివేయాలని టీటీడీ నిర్ణయించింది..రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తయ్యారు.. ముందస్తు చర్యల్లో భాగంగా బుధ,,గురువారాల్లో తిరుమలకు వెళ్లే రెండు నడకదారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది.. వర్షాల నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది..ఈ సమయంలో తిరుమల చేరుకునేందుకు ఘాట్‌రోడ్డే సురక్షితమని సూచించింది..

Spread the love
error: Content is protected !!