Recent Posts

2021లో 1.04 కోట్ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం

తిరుమల: కరోన వైరస్ ప్రజల్లో భయోత్పతం సృష్టించినప్పటికి,2021వ సంవ‌త్స‌రంలో 1.04 కోట్ల మంది భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారని టీటీడీ తెలిపింది.టీటీడీ తెలియచేసిన వివ‌రాలు ఇలా ఉన్నాయి..శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య – 1.04 కోట్లు,, విక్ర‌యించిన శ్రీ‌వారి ల‌డ్డూల సంఖ్య – 5.96 కోట్లు,, హుండీ కానుక‌లు – రూ.833.41 కోట్లు,, అన్న‌ప్ర‌సాదం స్వీక‌రించిన భ‌క్తుల సంఖ్య – 1.37 కోట్లు,,త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన భ‌క్తుల సంఖ్య – 48.75 ల‌క్ష‌లు నమోదు అయినట్లు పేర్కొంది.

జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు:- జనవరి 2న అధ్యయనోత్సవాలు ప్రారంభం,, జనవరి 13న వైకుంఠ ఏకాద‌శి, శ్రీ‌వారి స‌న్నిధిలో రాప‌త్తు,, జనవరి  14న వైకుంఠ ద్వాద‌శి, స్వామి పుష్క‌రిణీతీర్థ ముక్కోటి, భోగి పండుగ‌,, జనవరి 15న మకర సంక్రాంతి,, జనవరి 16న శ్రీ గోదా పరిణయోత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం,, జనవరి 17న రామకృష్ణ తీర్థ ముక్కోటి,, జనవరి 18న శ్రీ‌వారి ప్ర‌ణ‌య క‌ల‌హ మ‌హోత్స‌వం,, జనవరి 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు,, జనవరి  26న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు,, జనవరి 27న శ్రీవారు తిరుమలనంబి సన్నిధికి వేంచేపు..

Spread the love
error: Content is protected !!