Recent Posts

బంగ్లాదేశ్​లో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన దుండగులు

అమరావతి: దసరా పండుగ జరుగుతున్న సమయంలో బంగ్లాదేశ్​లోని కూమిల్లా,చాంద్​పుర్, ఛత్తోగ్రామ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను దుండగులు ధ్వంసం చేశారు.ఆలయాలపై దాడుల వార్తులు రావడంతో బంగ్లాదేశ్​లో పెద్ద ఎత్తున అలర్లు చెలరేగాయి.కూమిల్లా నగరంలోని స్థానిక ఆలయాన్ని ధ్వంసం చేశారనే వార్తలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యాయి.దింతో ఆ ప్రాంతంలో నిరసనలు చెలరేగడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.ఒకానొక సమయంలో పరిస్థితి చేయి దాటి పోయి దుర్గా పూజ జరిగే అనేక ప్రాంతాలకు అల్లర్లు విస్తరించాయి..అల్లర్లలో గురువారం ముగ్గురు చనిపోగా,అనేక మంది గాయపడ్డారు. ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేసేందుకు 22 జిల్లాల్లో బంగ్లాదేశ్​ పోలీస్, ర్యాపిడ్ యాక్షన్  బెటాలియన్,సరిహద్దు దళాలను రంగంలోకి దించి పరిస్థితిని చక్కదిద్దుతుంది..

Spread the love
error: Content is protected !!